logo

మహానాడు విజయవంతం చేయాలని పిలుపు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామరావు జన్మించి వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో

Published : 24 May 2022 06:20 IST


మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి

అరవిందనగర్‌(కడప), న్యూస్‌టుడే : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామరావు జన్మించి వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారన్నారు. విద్యుత్తు, ఇంధన, నిత్యావసరాలు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్త, ఇంటి పన్నులు ఇష్టానురాజ్యంగా పెంచేసి పేదలు, సామాన్యులపై భారం మోపారన్నారు. మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెలో మాజీ సర్పంచి వెంకటసుబ్బయ్యపై దాడి చేసి అతనిపైనే కేసు నమోదు చేశారన్నారు. గతంలో లింగాల మండలంలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాపై కూడా కేసులు నమోదు చేశారని, ఈ నెల 26న కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు వచ్చాయని, అప్పట్లో ఎస్పీ కేసుల్లేవని చెప్పి ఇప్పుడు ఏకంగా కోర్టుకే రమ్మంటున్నారన్నారు. సమావేశంలో వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల బీసీ సాధికారిక సమితి పరిశీలకులు షణ్ముగం, నాయకులు లక్ష్మీరెడ్డి, జయకుమార్, ఆమూరి బాలదాసు, మన్నూరు అక్బర్, శివరాం, మాసాపేట శివ, కోదండరాం, విశ్వనాథ్, ఓబులేసు, కొండాసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని