MLC Ananthababu: పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు

Updated : 23 May 2022 16:11 IST

కాకినాడ: మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు(Ananthababu) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం అనంతబాబును విచారిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతబాబును ఇవాళ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. సుబ్రహ్మణ్యం మృతిపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్‌ చేయాలని దళిత, ప్రజాసంఘాలతో పాటు వివిధ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ లొంగిపోయారు. అనంతబాబు లొంగుబాటు, సుబ్రహ్మణ్యం మృతి వ్యవహారంపై కాకినాడ పోలీసులు ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించే అవకాశముంది.

పోలీసుల అదుపులో సుబ్రహ్మణ్యం స్నేహితులు..

మరోవైపు సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సుబ్రహ్మణ్యం ఇద్దరు స్నేహితులు పవన్‌, సుబ్రహ్మణ్యంను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు. హత్య జరిగిన రోజు వారిద్దరూ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంతోనే ఉన్నారు. ఈ విషయంలో సుబ్రహ్మణ్యం స్నేహితుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ఆచూకీ తెలపాలని కాకినాడ ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఇద్దరూ తమ వద్దనే ఉన్నారని సర్దిచెప్పిన పోలీసులు.. వారిని పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని