logo

కొమురవెల్లి ఎస్సై సస్పెన్షన్‌

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు సస్పెండ్‌ అయ్యారు.

Published : 23 May 2024 02:46 IST

చేర్యాల, న్యూస్‌టుడే : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్‌- 1 ఐజీ ఏవీ రంగనాథ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనను మోసం చేస్తున్నాడని, న్యాయం చేయాలని కోరుతూ ఎస్సై నాగరాజు భార్య మానస మంగళవారం కొమురవెల్లి ఠాణా ఎదుట ఆందోళన చేసింది. ఈ సంఘటనపై సిద్దిపేట జిల్లా పోలీసు అధికారి విచారణ జరిపించి, నివేదిక సమర్పించడంతో ఐజీ చర్య తీసుకున్నారు. ఇదే వ్యవహారంతో సంబంధం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ ఠాణాలో పని చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పైనా వేటు పడింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని