logo

చెట్టును ఢీకొన్న కారు.. తండ్రీకుమారుల దుర్మరణం

కారు చెట్టును ఢీకొట్టడంతో తండ్రీ కుమారులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Published : 23 May 2024 02:54 IST

ఖమ్రొద్దీన్‌           రషీదొద్దీన్‌

మేడిపల్లి, న్యూస్‌టుడే: కారు చెట్టును ఢీకొట్టడంతో తండ్రీ కుమారులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఏఎస్సై రవీందర్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం... మెట్‌పల్లికి చెందిన ఖమ్రొద్దీన్‌(85) కరీంనగర్‌లోని తన కుమారుడు రషీదొద్దీన్‌(60) ఇంటికి వెళ్లాడు. బుధవారం తండ్రిని మెట్‌పల్లిలో దింపేందుకు కారు నడుపుతూ వస్తున్న రషీదొద్దీన్‌ మేడిపల్లి ఎస్సారెస్పీ వంతెన సమీపంలో రోడ్డు పక్కన చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తండ్రీ కుమారులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇరువురూ మృతిచెందడం కుటుంబంలో విషాదం నింపింది. ఖమ్రొద్దీన్‌ ఎస్సారెస్పీలో విశ్రాంత ఉద్యోగి కాగా రషీదొద్దీన్‌ మెట్‌పల్లి మండలం విట్టంపేటలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల్లో రషీదొద్దీన్‌ కూతురు వివాహం ఉండగా విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు రషీదొద్దీన్‌ భార్య నస్రీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మెట్‌పల్లి సీఐ నవీన్‌కుమార్, కథలాపూర్‌ ఎస్సై నవీన్‌ మృతదేహాలను పరీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు