logo
Published : 30/11/2021 03:21 IST

బోగస్‌ సంఘాలపై లోతుగా విచారణ

రేపో, మాపో చర్యలకు రంగం సిద్ధం

కరీంనగర్‌ సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో పని చేస్తున్న మహిళా సంఘాల్లో కొన్ని బయట పడిన బోగస్‌ సంఘాలపై అధికార యంత్రాంగం లోతుగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. జిల్లా పాలనాధికారి, అదనపు పాలనాధికారి ఈ విషయంలో ఎప్పటికప్పుడూ కమిషనర్‌ను, మెప్మా పీడీని ఆరా తీయడం, మైనార్టీ సంక్షేమశాఖ అధికారిని విచారణ అధికారిగా నియమించడంతో దస్త్రాల పరిశీలనలో వేగం అందుకుంది. బినామీ సంఘాలు ఏవిధంగా పుట్టుకొచ్చాయి? మూడేళ్ల కిందటి వీటిలో ఒక్కొక్కటిగా బయట పడటం, ప్రస్తుతం కొన్ని బ్యాంకుల నుంచే రుణాలు రికవరీ కావడం లేదని తెలియడం, ఒకటెండ్రు బ్యాంకుల నుంచే వివరాలు ఇవ్వడాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. మిగతా బ్యాంకర్లలో ఉన్న మహిళా సంఘాల డీఫాల్టర్స్‌ విషయాలను ఇకముందు పరిగణలోకి తీసుకోకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి 29 వరకు వరుసగా ‘ఈనాడు’లో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. కాగా విచారణ అనంతరం బాధ్యులైన వారిపై రేపో, మాపో చర్యలకు రంగం సిద్ధం చేశారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని