12 పడకల ఐసీయూ ప్రారంభం
మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్
చైతన్యపురి, న్యూస్‌టుడే: కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మెదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన 12 పడకల ఐసీయూ గదిని ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్ వారు ఐసీయూ పడకలు సామగ్రికి రూ.30లక్షలు వితరణ చేయగా, నిర్మాన్ స్వచ్ఛంద సంస్థ పరికరాలను కొనుగోలు చేసి అమర్చింది. లారస్ ల్యాబ్ అందించిన పరికరాలతో కొవిడ్ రోగులకే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా వైద్యం అందించాలన్నారు. ఐసీయూ కోసం 25 ఆక్సిజన్ సిలిండర్లు, 2 వెంటిలేటర్లు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో డాక్టర్ చంద్రశేఖర్, లారస్ ల్యాబ్ సీనియర్ ఉపాధ్యక్షులు సీహెచ్. సీతారామయ్య, పవన్‌కుమార్, నిర్మాణం సంస్థ అధ్యక్షుడు గోపి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement