logo
Published : 02/12/2021 03:38 IST

కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌


మోహినికుంటలో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: ముస్తాబాద్‌ మండలం మోహినికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలుకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. యాసంగి పంటల సాగుపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పొద్దు తిరుగుడు పంటలు వేస్తామని కలెక్టర్‌కు రైతులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచి కల్వకుంట్ల వనజ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

నిర్వాహకులపై కేసు

నామాపూర్‌ (ముస్తాబాద్‌) : ముస్తాబాద్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో నామాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తూనికలు, కొలతల శాఖ అధికారి రూపేశ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం 42 కిలోలు తూకం వేస్తున్నారు. 40 కిలోల లెక్క చూపుతున్నారు. అదనంగా తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తక్కెడ బాట్లను వినియోగిస్తున్నారన్నారు. సీఈవో బాలయ్య, నిర్వాహకుడు రవీందర్‌పై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైతులను మోసం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని