logo

దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట

దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరంలో

Published : 20 Jan 2022 02:27 IST

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, చిత్రంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాధవి,

ఎంపీపీ వజ్రమ్మ, జడ్పీటీసీ సభ్యుడు రవి, కౌన్సిలర్‌ ఉమారాణి తదితరులు

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరంలో బుధవారం అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వయో వృద్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీకి లబ్ధిదారుల ఎంపికకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరవాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్‌ ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఈ నెల 25 వరకు శిబిరాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. నెల రోజుల్లో ఉపకరణాలు అందజేస్తారని తెలిపారు. అనంతరం ఆమె వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు వజ్రమ్మ, మల్లేశం యాదవ్‌, జడ్పీటీసీ సభ్యులు రవి, మీనయ్య, వేములవాడ ఏఎంసీ ఛైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌రావు, కౌన్సిలర్‌ ఉమారాణి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఏస తిరుపతి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని