logo

మళ్లీ కరోనా ఉద్ధృతి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెండవ దశలో జిల్లాను వణికించిన ఈ వ్యాధి మళ్లీ మూడో దశలో కూడా

Published : 20 Jan 2022 02:27 IST

74కు పెరిగిన కేసులు

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెండవ దశలో జిల్లాను వణికించిన ఈ వ్యాధి మళ్లీ మూడో దశలో కూడా భయపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్‌ కేసులు నమోదైనప్పటికీ కరీంనగర్‌లో కాలేదు. కాని పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం 46 మంది వ్యాధి బారిన పడగా బుధవారం ఆ సంఖ్య 74కు చేరింది. ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరగకపోయినప్పటికీ ప్రభుత్వ, ప్రైయివేటు ఆసుపత్రులకు వెళుతున్న ఔట్‌ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ, ప్రైయివేటు ఆసుపత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. పంచాయతీరాజ్‌, ఇంజినీరింగ్‌ శాఖలో పనిచేసే ముఖ్యులతో పాటు సిబ్బంది పాజిటివ్‌తో బాధపడ్తున్నట్లు సమాచారం. జగిత్యాల జిల్లాలో కూడా కొందరు ఉద్యోగులకు సోకినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లాలో బుధవారం 70 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తక్కువ సంఖ్యలో నమోదైంది. ఓవైపు నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతూనే మరోవైపు టీకా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మొదటి డోసు వంద శాతం దాటగా రెండో డోసు 94 శాతానికి పైగా ఉంది. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్నవారు 60కు ఏళ్లకు పైబడిన వారికి కూడా టీకా కార్యక్రమం కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని