logo

త్వరలోనే విద్యార్థులకు రవాణా భత్యం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు త్వరలోనే రవాణా భత్యం విడుదల కానుంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తయింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరు, ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు కి.మీ.లు,

Published : 28 Jan 2022 03:33 IST

ఉమ్మడి జిల్లాలో 2339 మంది వివరాలు నమోదు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు త్వరలోనే రవాణా భత్యం విడుదల కానుంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తయింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరు, ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు కి.మీ.లు, ఉన్నత పాఠశాలలు అయిదు కి.మీ.ల దూరంలోపు ఉంటున్న విద్యార్థులకు విద్యాశాఖ రవాణా భత్యం మంజూరు చేస్తోంది. కొవిడ్‌ కారణంగా గతేడాది ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడంతో ప్రతిపాదనలు రూపొందించలేదు. ప్రస్తుత ఏడాదిలో ప్రత్యక్ష బోధన సాగుతుండటంతో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రవాణా భత్యం మంజూరు కోసం గతేడాది జులైలో అధికారులు వివరాలు సేకరించారు. ఈనెల 19లోగా ఆన్‌లైన్‌ నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల వారీగా అర్హులైన విద్యార్థుల వివరాలను అంతర్జాంలో నిక్షిప్తం చేశారు.

ఈసారి 9, 10 తరగతులకు అవకాశం

ఇప్పటివరకు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు రవాణా భత్యం నిధులు కేటాయిస్తున్నారు. పలు గ్రామాల్లో ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈసారి కొత్తగా 9, 10 తరగతుల విద్యార్థులకు అవకాశం కల్పించారు. ప్రాథమిక పాఠశాలల్లో చదివే వారికి ఏడాదికి రూ.4 వేలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.6 వేల చొప్పున విడుదల చేస్తారు. పాఠశాలలు దూరంగా ఉండటంతో విద్యార్థులే సొంత డబ్బులు వేసుకుని ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,339 మంది విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశాయి. త్వరలోనే వీరికి రవాణా భత్యం విడుదల కానుంది.

విద్యార్థుల సంఖ్య ఇలా..
పెద్దపల్లి: 704
జగిత్యాల: 379
రాజన్నసిరిసిల్ల: 820
కరీంనగర్‌: 436

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని