Crime News: సినిమా టికెట్లకు తండ్రి డబ్బులివ్వలేదని..
సినిమా టికెట్ల కోసం తండ్రి డబ్బు ఇవ్వలేదని మనస్తాపం చెంది.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.
జగిత్యాల: సినిమా టికెట్ల కోసం తండ్రి డబ్బు ఇవ్వలేదని మనస్తాపం చెంది.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పురానిపేటలో ఎనిమిదో తరగతి చదువుతున్న పాండులోజి నవదీప్.. సినిమాకు వెళ్లేందుకు తన మిత్రులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారంటూ.. తండ్రి నర్సయ్యను రూ.300 ఇవ్వాలని అడిగాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, కాస్త సమయం ఇవ్వాలంటూ తండ్రి బదులిచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నవదీప్.. ఇంట్లో వేరొక గదిలోకి వెళ్లి ఉరేసుకొని బలవర్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్