రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి బుధవారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి భారీగా తరలి వచ్చారు.
ఆలయ ప్రాంగణంలో భక్తులు
వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి బుధవారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు, పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నకు ప్రీతి పాత్రమైన కోడె మొక్కులను కొందరు కుటుంబ సమేతంగా చెల్లించుకున్నారు. అభిషేకం, అన్నపూజ, కల్యాణాలు, కుంకుమ పూజలు వంటి వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, అధికారులు పర్యవేక్షణ చేశారు. దాదాపు 15 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసిన కేంద్రం
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!
-
Politics News
Chandrababu: కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
-
World News
Donald Trump: ‘24 గంటల్లోపే ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించుతా..!’
-
Sports News
IND vs AUS:ఈ భారత స్టార్ బ్యాటర్‌ను ఔట్ చేస్తే చాలు.. : హేజిల్‌వుడ్