తల్లి కళ్లెదుటే తనయుడి దుర్మరణం
ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకుని వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. తన కళ్లెదుటే కుమారుడి మృతి చెందడంతో ఆ తల్లి రోదించిన తీరు చూసేవారిని కంటతడి పెట్టించింది.
రమేష్
కోరుట్ల గ్రామీణం, న్యూస్‌టుడే : ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకుని వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. తన కళ్లెదుటే కుమారుడి మృతి చెందడంతో ఆ తల్లి రోదించిన తీరు చూసేవారిని కంటతడి పెట్టించింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ శివారులో ఆదివారం బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న సంఘటనలో కుమారుడు మృతి చెందగా తల్లి గాయపడింది. ఎస్సై శ్వేత కథనం ప్రకారం.. కోరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెందిన బలుసు రమేష్ (43) తన తల్లి గంగును ద్విచక్ర వాహనంపై తీసుకుని ఆదివారం సిరికొండ గ్రామానికి వెళ్తున్నాడు. సిరికొండ గ్రామశివారు మూలమలుపు వద్ద కోరుట్ల వైపు వస్తున్న మినీ బొలేరా కోళ్ల వ్యాను వారి వాహనాన్ని ఢీ కొనడంతో రమేష్ తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న గంగు ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడటంతో గాయపడింది. దెబ్బలతో ఇబ్బంది పడుతూనే కుమారుడి మృతదేహం చూసి ఆ తల్లి రోదన అందరినీ కలిచి వేసింది. రమేష్ గల్ప్ నుంచి రెండు నెలల క్రితం వచ్చాడు. మరో పదిహేను రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా మృత్యువాత పడ్డాడు. ఆయనకు భార్య 8, 5 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెనే తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana Formation Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు
-
India News
IRCTC: కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
General News
Pawan Kalyan: పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలి: పవన్‌కల్యాణ్
-
Sports News
WTC Final: ఓవల్ ఎవరికి కలిసొచ్చేనో?
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Gold Smuggling: బంగారాన్ని సముద్రంలో విసిరేసిన స్మగ్లర్లు.. గాలించి 11 కేజీలు వెలికితీశారు!