logo

ఆస్తి పన్ను చెల్లింపులో ఆదర్శం

నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు పురపాలకశాఖ ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు ఎర్లీబర్డ్‌ పథకం ప్రవేశపెట్టింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ప్రకటించింది.

Published : 04 May 2024 04:34 IST

రాష్ట్రంలో కోరుట్ల మున్సిపల్‌కు రెండో స్థానం

కోరుట్ల, న్యూస్‌టుడే: నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు పురపాలకశాఖ ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు ఎర్లీబర్డ్‌ పథకం ప్రవేశపెట్టింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించిన వారు కూడా దీనికి అర్హులుగా ప్రకటించింది. 5 శాతం రాయితీతో ఆస్తిపన్ను వసూలు చేసేందుకు పట్టణాల్లో మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచారు. వీలైనంతా ఎక్కువగా పన్ను వసూలు చేసేందుకు కృషి చేశారు. ఏప్రిల్‌ 30 నాటికి గడువు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 143 మున్సిపల్‌లు, నగర పాలికలు ఉండగా ఇందులో సిద్దిపేట పురపాలక సంఘం 43.04 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కోరుట్ల పురపాలక సంఘం 40.73 శాతంతో రెండోస్థానంలో నిలవగా, జమ్మికుంట మున్సిపల్‌ 39.69 శాతంతో మూడోస్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని