logo

పట్టణవాసులు కదలాలి

పల్లెలతో పోలిస్తే అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నా పట్టణవాసులు మాత్రం ఎన్నికల పోలింగ్‌పై ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల జిల్లా అయిదు పురపాలక సంఘాలతో ప్రత్యేకతను చాటుతుండగా ఈ ఒరవడి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కనిపిస్తేనే స్పష్టమైన ఫలితం

Published : 08 May 2024 05:09 IST

ఓటింగ్‌ శాతం పెరిగితేనే ఫలితంపై స్పష్టమైన ప్రభావం
న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

ల్లెలతో పోలిస్తే అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నా పట్టణవాసులు మాత్రం ఎన్నికల పోలింగ్‌పై ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల జిల్లా అయిదు పురపాలక సంఘాలతో ప్రత్యేకతను చాటుతుండగా ఈ ఒరవడి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కనిపిస్తేనే స్పష్టమైన ఫలితం వెలువడే అవకాశం ఉంది. కాబట్టి పట్టణవాసులూ పోలింగ్‌ బూత్‌లవైపు కదలాల్సిన అవసరం ఉంది.

  • ఓటర్లందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపడుతుండగా పట్టణ ప్రజలు తగురీతితో స్పందించాల్సి ఉంది. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటువేసే సదుపాయాన్ని వినియోగించుకోవాలి.
  • ఎన్నికల విధుల్లోనివారు పోస్టల్‌బ్యాలెట్ను వినియోగించుకోవాలి. పోలింగ్‌ రోజున సంస్థలకు సెలవులిస్తుండగా ఎన్నికల విధుల్లో లేని అధికారులు, సిబ్బంది, సంస్థల ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పనిసరిగా ఓటువేయాలి.
  • పట్టణాల్లో చాలా మంది ఓటర్లు తరచూ ఇళ్లను మార్చుతుండగా వేర్వేరు వార్డుల పరిధిలోని జాబితాల్లో ఓట్లు నమోదై ఉంటున్నాయి.
  • ఆయా ఇళ్ల చిరునామాల్లో అందుబాటులో ఉన్న ఓటర్లకు పోలింగ్‌ చీటీలు పంపిణీ చేస్తుండగా చాలామందికి ఇవి అందటం లేదు. దీనికి ఓటర్లు కంగారు పడకుండా తమ ధ్రువపత్రాల్లో ఏదో ఒక దానిని తీసుకుని సదరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి నేరుగా ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.
  • చిరునామా మారినవారు, వేరే ప్రాంతానికి వెళ్లినవారు తాము ఇదివరకు ఓటున్న ఇళ్లవద్దకు వెళ్లి పోలింగ్‌ చీటీలను తీసుకోవచ్చు.
  • స్థానికంగా అందుబాటులోని పోలింగ్‌బూత్‌ల సిబ్బంది వద్దగల ఓటరు జాబితాలో తమపేర్లను సరిచూసుకుని పోలింగ్‌కు వెళ్లవచ్చు.
  • నిలబడేందుకు ఇష్టపడకనే చాలా మంది పట్టణవాసులు ఓటుకు దూరంగా ఉంటారు. ఇలా కొద్దిసేపు నిలబడటం నమోషీగా భావించకుండా ఓటు వేయటం బాధ్యతగా గుర్తించాలి.
  • పోలింగ్‌ కేంద్రాల్లోనూ జాప్యం జరగకుండా త్వరితగతిన ఓట్లు పోలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
  • శివారు ప్రాంతాల్లోనివారు, నూతనంగా ఓటు నమోదు చేయించుకున్నవారు వినియోగించుకునేలా అధికారులు, సిబ్బంది సహకరించాలి.
  • కొన్ని విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలకు సెలవులు ఇవ్వనందున వీటిల్లో పనిచేసేవారు ఓటింగ్‌కు రావటంలేదు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా సిబ్బందికి వేతనంతో కూడిన సెలవునిచ్చేలా సంస్థలను ప్రభుత్వం ఆదేశించాలి.
  • స్థానికంగా ఓటు కలిగి ఉన్న ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు కూడా తరలివచ్చి ఓటువేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు