logo

అయ్యో రైతన్నా..

జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. శ్రమ ఫలితం చేతికందే ముందు ధాన్యం తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Published : 08 May 2024 05:21 IST

చొప్పదండి: వర్షంలో ధాన్యం తడవకుండా రైతుల పాట్లు

జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. శ్రమ ఫలితం చేతికందే ముందు ధాన్యం తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరిపైర్లు నేలవాలి వడ్లు రాలిపోయాయి. యాస్వాడ, మాదాపూర్‌, దుద్దెనపల్లి, బొమ్మకల్‌ తదితర గ్రామాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల ఇంటి పైకప్పులు కొట్టుకుపోయాయి. చెట్లు విరిగిపోయాయి. బాధితులను ఆదుకోవాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్తు స్తంభాలు కూలడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.

న్యూస్‌టుడే యంత్రాంగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు