logo

రైతు భరోసా నిలిపివేయించింది ఆ పార్టీలే

భాజపా, భారాసలకు రైతులపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపించారని ప్రభుత్వ విప్‌

Published : 10 May 2024 01:13 IST

వట్టెంలలో మాట్లాడుతున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: భాజపా, భారాసలకు రైతులపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపించారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. గురువారం వేములవాడ గ్రామీణ మండలం తుర్కాషినగర్‌, ఫాజుల్‌నగర్‌, వట్టెంల, నమిలిగుండుపల్లి, నూకలమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు గానీ కార్పొరేట్‌ వ్యక్తులకు రూ.కోట్లు మాఫీ చేసిందని పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వని మోదీ ఇక్కడి ప్రజలకు ఏం ఇస్తారని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని ఆరోపించారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

వేములవాడ: వేములవాడలోని భగవంతరావునగర్‌లో పట్టణ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారం చేశారు. నాయకులు మహేశ్‌, శ్రీనివాస్‌, వెంకటస్వామి, దేవయ్య, అజయ్‌, విష్ణు ప్రసాద్‌, మధు, లహరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు