logo

కుల వృత్తులను కాపాడటంలో కాంగ్రెస్‌దే పైచేయి

కులవృత్తులను కాపాడటంలో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్‌దే పైచేయి అని ఆ పార్టీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు.

Published : 10 May 2024 06:44 IST

పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేందర్‌రావు, పాల్గొన్న సంఘ నేతలు

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కులవృత్తులను కాపాడటంలో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్‌దే పైచేయి అని ఆ పార్టీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు. గురువారం నగరంలోని పద్మశాలీ భవన్‌లో ఆ సంఘ నేతలతో రాజేందర్‌రావు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. కుల వృత్తులను రక్షించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇప్పటికే సిరిసిల్ల చేనేత కార్మికులకు చేసే సేవలో భాగంగా ఒక మ్యానిఫెస్టో విడుదల చేసినట్లు, మహిళలు, యువత, విద్యార్థులు అన్ని వర్గాల వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్న భాజపా, భారాసలను దారిదాపులకు రానివ్వవద్దని సూచించారు. భాజపా వస్తే రాజ్యాంగం రద్దయ్యే పెను ముప్పు పొంచి ఉందని, దేవుడు బొమ్మను అడ్డం పెట్టుకొని ఓట్ల కోసం ఎదురు చూసే వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాజేందర్‌రావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పద్మశాలీ సంఘం నేతలు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్‌, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం, మాజీ ఎంపీపీ వొల్లాల కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ అరుకాల వీరేశలింగం, మాజీ సర్పంచి గడ్డం శ్రీరాములు, సహకార సంఘం అధ్యక్షుడు మంచిగట్ల కోటేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు సమక్షంలో పద్మశాలీ నేత, కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌, ప్రభాకర్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు