logo
Published : 28/11/2021 00:54 IST

కాలువ తూము మరమ్మతు ప్రారంభం

పనులను పరిశీలిస్తున్న కేవీ, కొల్లా ఇతర భాజపా నాయకులు

సింధనూరు, న్యూస్‌టుడే: తుంగభద్ర ఎడమకాలువ ఆయకట్టు పరిధిలో అతిపెద్ద ఉపకాలువల్లో ఒకటైన సింధనూరు తాలూకాలోని 36వ కాలువ తూము మరమ్మతులు ఎట్టకేలకు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రధాన కాలువ నుంచి 36వ కాలువలోకి జలాలు ప్రవేశించే జీరో వద్ద గల రెండు తూముల్లో ఒకటి మూడు నెలల కిందట దెబ్బతింది. దీంతో ఈ కాలువకు పూర్తి సామర్ధ్యంలో నీరు రావడం లేదు. నిత్యం ఈ కాలువకు 215 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. దాదాపు 45 వేల హెక్టార్లలో పంటలు సాగవుతుంటాయి. పురాతనమైన తూము దెబ్బతిన్న విషయాన్ని రైతులే కనుగొన్నారు. అధికారులకు చెప్పగా ప్రధాన కాలువలో నిండుగా నీరుపారుతున్న ఈ సమయంలో ఎలాంటి మరమ్మతులు చేపట్టే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్థానిక భాజపా నాయకులు నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రెండో పంటకు కాస్త సమయం ఉండటం..ఖరీఫ్‌ నూర్పిళ్లు జరుగుతున్నందున కాలువ ప్రవాహం కాస్త తగ్గించారు. ఇదే సమయంలో పనులు చేపడితే మంచిదని, వేసవి పంటకు ఇబ్బంది రాకుండా ఉంటుందని కోరడంతో శనివారం అధికారులు యంత్రాలతో పనులు ప్రారంభించారు. మాజీ ఎంపీ కె.విరుపాక్షప్ప, కొల్లా శేషగిరిరావు, ఎన్‌.శివనగౌడ, విరుపాపుర అమరేగౌడ తదితరులు కాలువ వద్దకు వెళ్లి పనులు పరిశీలించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని