logo

పొగాకు వస్తువుల సేవనం ప్రమాదకరం

పొగాకు వస్తువుల సేవనం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాటికి దూరంగా ఉండాలని జిల్లా సర్వైలెన్స్‌ అధికారి డా.మరియంబి సూచించారు. బళ్లారి ప్రభుత్వ మున్సిపల్‌ పదవీ పూర్వ కళాశాలలో శనివారం బోధన సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని డా.మరియంబి ప్రారంభించి మాట్లాడారు.

Published : 05 Dec 2021 01:44 IST


మాట్లాడుతున్న అధికారి ఎన్‌.రాజు

బళ్లారి, న్యూస్‌టుడే: పొగాకు వస్తువుల సేవనం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాటికి దూరంగా ఉండాలని జిల్లా సర్వైలెన్స్‌ అధికారి డా.మరియంబి సూచించారు. బళ్లారి ప్రభుత్వ మున్సిపల్‌ పదవీ పూర్వ కళాశాలలో శనివారం బోధన సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని డా.మరియంబి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్లో పొగాకు నియంత్రణ చట్టం తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పొగాకు వస్తువుల సేవనం వల్ల వచ్చే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పదవీపూర్వ శిక్షణ శాఖ ఉపనిర్దేశకుడు ఎన్‌.రాజు మాట్లాడుతూ కళాశాలల్లో విద్యార్థులను చైతన్యపరుస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అధికారి దురుగప్ప ఎస్‌.మాచనూరు, మల్లేశప్ప, మోహన్‌రెడ్డి, డా.జబీన్‌ తాజ్‌ తదితరులు హాజరయ్యారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని