logo

రోశయ్యతో కర్ణాటకాంధ్రుల బంధం

తెలుగు విజ్ఞాన సమితికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కర్ణాటక, తమిళనాడులకు గవర్నర్‌గా సేవలు అందించిన కె.రోశయ్యతో అర్ధ శతాబ్ద అనుబంధం ఉందని సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు నివాళులర్పించారు. ఈ సమితి ఆధ్వర్యంలోనే 2013లో ఇందిరా ప్రియదర్శిని పురస్కారాన్ని,

Published : 05 Dec 2021 01:44 IST


రోశయ్యను సత్కరించి స్మరణిక అందజేసిన నాటి జ్ఞాపకం (దాచినచిత్రం)

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : తెలుగు విజ్ఞాన సమితికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కర్ణాటక, తమిళనాడులకు గవర్నర్‌గా సేవలు అందించిన కె.రోశయ్యతో అర్ధ శతాబ్ద అనుబంధం ఉందని సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు నివాళులర్పించారు. ఈ సమితి ఆధ్వర్యంలోనే 2013లో ఇందిరా ప్రియదర్శిని పురస్కారాన్ని, అంతకు మునుపు సమితి ఆడిటోరియంలో ఆయనను ఘనంగా సత్కరించామని గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన రోశయ్యకు సమితి సభ్యులు శనివారం సంతాపసభ ఏర్పాటు చేసి.. జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తెలుగు భాషపై చక్కని పట్టున్న వ్యక్తిగా, పేరొందిన ఆర్థిక మంత్రిగా, అజాత శత్రువుగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సమితి చేస్తోన్న సేవలు పలుసార్లు ప్రశంసించారని తెలిపారు. రోశయ్య మరణంతో కాంగ్రెస్‌ పార్టీ ఒక సీనియరు నాయకుడ్ని కోల్పోయిందని మాజీ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. నివాళులు అర్పించిన వారిలో సమితి ప్రతినిధులు కె.గంగరాజు,  ఇడమకంటి లక్ష్మీరెడ్డి, వరదరాజు, చంద్రమోహన్‌ తదితరులున్నారు.
ముఖ్యమంత్రి సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సంతాపాన్ని ప్రకటించారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా, దక్షత కలిగిన పాలకునిగా అందరికీ ఆయన ఆప్తునిగా ఉన్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి, మాజీ ఎమ్మెల్సీ శరవణ, కర్ణాటక ఆర్య వైశ్యుల సంఘం, సమాఖ్యల ప్రతినిధులు రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ, సంతాపాలను ప్రకటించారు.


బెంగళూరులో నివాళి అర్పిస్తున్న తెలుగు విజ్ఞాన సమితి సభ్యులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని