logo

మంత్రులకు కొవిడ్‌ ఎలా వచ్చెనో?

మేకెదాటు పాదయాత్రను తిరిగి కొనసాగించడంతో పాటు మహదాయి, కృష్ణా పథకాల అమలుకూ పాదయాత్రల్ని నిర్వహిస్తామని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. రెండు రోజుల పాటు బాదామి నియోజకవర్గంలో పర్యటించేం

Published : 25 Jan 2022 04:37 IST


గూళదగుడ్డ నగరసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికైన మహిళలను అభినందిస్తున్న సిద్ధరామయ్య

బాగలకోటె, న్యూస్‌టుడే : మేకెదాటు పాదయాత్రను తిరిగి కొనసాగించడంతో పాటు మహదాయి, కృష్ణా పథకాల అమలుకూ పాదయాత్రల్ని నిర్వహిస్తామని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. రెండు రోజుల పాటు బాదామి నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆయన సోమవారం బాదామి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగించిన పాదయాత్ర కారణంగానే కరోనా ప్రబలిందని భాజపా నాయకులు చేస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మంత్రులు సోమశేఖర్‌, ఆర్‌.అశోక్‌ తదితరులకు కరోనా సోకేందుకు కూడా కాంగ్రెస్‌ పాదయాత్రే కారణమా? అని ఎద్దేవా చేశారు. పాదయాత్రల గురించి పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించామని చెప్పారు. కరోనా తీవ్రత తగ్గిన తరువాత ఈ ఉద్యమాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గూళదగుడ్డ నగరసభకు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మహిళల్ని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని