logo

వారసత్వ పట్టాలెక్కిన పర్యాటకం

అత్యున్నత సేవలతో తులతూగుతున్న ‘ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌’ తరహాలోనే వారసత్వ సంపద ప్రాంతాల వీక్షణ కోసం ‘హెరిటెజ్‌ ఆన్‌ వీల్‌’ పేరిట మరో పర్యాటకానికి రైల్వేశాఖ శ్రీకారం చుడుతోంది.

Published : 09 Aug 2022 02:10 IST


ఆవతిహళ్లి రైల్వే స్టేషన్‌కు 108 సంవత్సరాల చరిత్ర సొంతం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అత్యున్నత సేవలతో తులతూగుతున్న ‘ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌’ తరహాలోనే వారసత్వ సంపద ప్రాంతాల వీక్షణ కోసం ‘హెరిటెజ్‌ ఆన్‌ వీల్‌’ పేరిట మరో పర్యాటకానికి రైల్వేశాఖ శ్రీకారం చుడుతోంది. నగర సమీపంలోని నాలుగు ప్రాచీన రైల్వే స్టేషన్లను గుర్తించి వాటికి నైరుతి రైల్వే విభాగం అధికారులు మరమ్మతులు చేయిస్తున్నారు. ఆపై వాటిలో కొన్ని ప్రదర్శనాంశాలు ఏర్పాటు చేయాలనేది ఆలోచన. బెంగళూరు- చిక్కబళ్లాపుర- కోలారు మార్గాల్లో ఆ పాత స్టేషన్లు విస్తరించాయి. దొడ్డజాల, ఆవతిహళ్లి, దేవనహళ్లి, నందిహిల్స్‌ రైల్వే స్టేషన్లను బ్రిటిష్‌ పాలకులు 108 ఏళ్ల కిందట నిర్మించారు. వాటిని ఇంట్యాక్‌ సహాయంతో బాగు చేస్తున్నారు. దొడ్డజాల రైల్వేస్టేషన్‌ మరమ్మతు పూర్తి చేశారు. నాలుగు స్టేషన్లను ప్రదర్శన శాలలుగా మార్చుతారు. రైల్వే శాఖతో పాటు పర్యాటక శాఖ చిత్రాలు వాటిలో చూడొచ్చు. చుట్టుపక్కల సినిమాల చిత్రీకరణకు అవకాశం కల్పిస్తారు. నంది హిల్స్‌కు వచ్చే సందర్శకులు అక్కడి రైల్వే ప్రదర్శన శాల తిలకించే వెసులుబాటు ఉంటుంది. నందిహిల్స్‌ సంబంధిత సమాచారాన్ని అక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. రానున్న తరాల కోసం నాటి ఇంజినీర్లు తీర్చిదిద్దిన ఈ భవనాలను భద్రంగా కాపాడటమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.


బెంగళూరు శివార్లలోని దొడ్డజాల రైల్వేస్టేషన్‌ పాతందాలు


నందిహిల్స్‌ రైల్వే స్టేషన్‌ భవన్‌ నేటికీ భద్రమే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని