logo

అప్పతో బొమ్మై చర్చలు

అవినీతి నియంత్రణ దళం (అనిద) అధికారాలను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం చర్చించారు. మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశాన్ని చర్చించామని బొమ్మై తెలిపారు. లోకాయుక్తను బలోపేతం

Published : 13 Aug 2022 01:22 IST

యడియూరప్పను కలిసిన బొమ్మై

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : అవినీతి నియంత్రణ దళం (అనిద) అధికారాలను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం చర్చించారు. మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశాన్ని చర్చించామని బొమ్మై తెలిపారు. లోకాయుక్తను బలోపేతం చేస్తామని పార్టీ ప్రణాళికలోనే ప్రకటించామని గుర్తు చేశారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. జాతీయ నాయకులతోనూ చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ అప్పీలుకు వెళితే లోకాయుక్తను బలోపేతం చేయడాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ప్రజలకు సంకేతాలు వెళతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని