logo

జీబ్రాచేపపై పరిశోధనలు అవసరం

మానవ శరీరంలో వ్యాధులు వ్యాపించడానికి సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడే జీబ్రాచేపలపై పరిశోధనలు చేయడం మరింత అవసరమని ఆచార్యులు డా.విజయకుమార్‌ మలశెట్టి పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 01:48 IST

విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు

బళ్లారి, న్యూస్‌టుడే: మానవ శరీరంలో వ్యాధులు వ్యాపించడానికి సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడే జీబ్రాచేపలపై పరిశోధనలు చేయడం మరింత అవసరమని ఆచార్యులు డా.విజయకుమార్‌ మలశెట్టి పేర్కొన్నారు. బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జైవిక తంత్రజ్ఞానం అధ్యయన విభాగం, తమిళనాడు తిరుచిరాపల్లి అందవన్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల అధ్యయన కేంద్రం సంయుక్తంగా విశ్వవిద్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన జీబ్రాచేప అవలోకనంపై ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ చేప లార్వా ఔషధాలను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ శరీరంలో 70 శాతం ఉపయోగపడే సకశేరుకాలు ఉంటున్నాయి. క్యాన్సర్‌, హృదయ సంబంధ రోగాలు, అంటువ్యాధులు, మధుమేహం, ఇతరాలకు ఉపయోగిస్తారని వివరించారు. శ్రీమద్‌ అందవన్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల జైవిక తంత్రజ్ఞాన అధ్యయన విభాగం అధ్యాపకుడు డా.శివ విజయకుమార్‌ మాట్లాడుతూ జీబ్రాచేప ప్రాముఖ్యం, నిర్వహణపై విద్యార్థులకు శిక్షణ శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పరిశోధన విద్యార్థి సాయి సందీప్‌, నిర్దేశకుడు తిప్పేరుద్రప్ప, డా.ఆశాజ్యోతి, డా.తిప్పేస్వామి పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని