logo

బాదర్లి ‘పంచ్‌’పటాకా

త్రిముఖ పోటీలో ఉత్కంఠ కలిగించిన సింధనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బాదర్లి హంపనగౌడ విజయకేతనం ఎగురవేశారు.

Published : 14 May 2023 05:39 IST

ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రాలు అధికారుల నుంచి స్వీకరిస్తున్న బాదర్లి

సింధనూరు, న్యూస్‌టుడే: త్రిముఖ పోటీలో ఉత్కంఠ కలిగించిన సింధనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బాదర్లి హంపనగౌడ విజయకేతనం ఎగురవేశారు. ఈ క్షేత్రంలో అయిదోసారి గెలిచి ఎమ్మెల్యేగా తన పేరిటే ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. శనివారం ఉదయం రాయచూరులో ఓట్లు లెక్కింపు ఆరంభ దశ నుంచే బాదర్లి ఆధిక్యతను చాటుకున్నారు. పోస్టల్‌ ఓట్ల దగ్గర నుంచి చివరిన 20వ రౌండు వరకూ ముందుకు దూసుకెళ్లారు. ఆయన తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థి కె.కరియప్పపై 21,991 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ద్వితీయస్థానం కోసం భాజపా కె.కరియప్ప, జేడీఎస్‌ అభ్యర్థి నాడగౌడ నువ్వా-నేనా అంటూ పోటీ పడినా ఆ స్థానాన్ని కరయప్పే భర్తీ చేశారు. విజేత బాదర్లి 73,183 ఓట్లు పొందగా, భాజపా కె.కరియప్ప 51,192 ఓట్లు సాధించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నాడగౌడకు 43,261 ఓట్లు దక్కాయి. తీవ్రస్థాయిలో ప్రచారంలో నిలిచి సంచలనం కలిగిస్తారని భావించిన కేఆర్‌పీపీ అభ్యర్థి నెక్కంటి మల్లికార్జునకు 2,133 ఓట్లే పోలయ్యాయి. ఆప్‌ అభ్యర్థి సంగ్రామ్‌కు 1388 ఓట్లు పడగా, నోటా ఖాతాలో 1057 ఓట్లు పోలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని