logo

జులై 9 నుంచి హంపీలో జీ-20 సదస్సు

హంపీలో జులై 9 నుంచి 12 వరకు జీ-20 ప్రత్యేక సదస్సు కొనసాగుతుందని విజయనగర జిల్లా పాలనాధికారి టి.వెంకటేశ్‌ తెలిపారు.

Updated : 01 Jun 2023 04:50 IST

జిల్లాస్థాయి అధికారులకు సూచనలు ఇస్తున్న పాలనాధికారి వెంకటేశ్‌

హొసపేటె: హంపీలో జులై 9 నుంచి 12 వరకు జీ-20 ప్రత్యేక సదస్సు కొనసాగుతుందని విజయనగర జిల్లా పాలనాధికారి టి.వెంకటేశ్‌ తెలిపారు. బుధవారం ఏర్పాట్లపై ఆయన జిల్లాస్థాయి అన్నిప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. సదస్సులో ఏర్పాట్లు, సౌకర్యాలను పకడ్బందీగా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ అన్ని శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో సదస్సు విజయవంతానికి కృషి చేయాలి. దానికి కావాల్సిన నిధులకోసం ప్రతిపాదన సిద్ధం చేసి సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపించాలని సూచించారు. జీ-20 సదస్సును తిలకించటానికే పెద్ద ఎత్తున సందర్శకులు, పర్యాటకులు హంపీ వచ్చే అవకాశం ఉంది, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. స్వచ్ఛతకు పెద్దపీట వేయాలని తెలిపారు. సదస్సు ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం, హంపీ ప్రాధికారం, హంపీ పంచాయతీ, కేంద్ర పురావస్తు శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. హంపీకి అనుసంధానం కల్పించే రహదారుల మరమ్మతు, నిర్వహణను ఇప్పటినుంచే ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.సదాశివ ప్రభు, అదనపు పాలనాధికారి డాక్టర్‌ అనురాధ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని