logo

UAV ‘Ghatak’: మానవరహిత విమానం విజయ విహారం!

మానవరహిత యుద్ధ విమానాల తయారీ అంకం విజయపథంలో సాగుతోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తన ఎక్స్‌ ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Updated : 17 Dec 2023 09:36 IST

ఆకాశంలో విహరిస్తున్న రిమోట్‌ విమానం

చిత్రదుర్గం, న్యూస్‌టుడే : మానవరహిత యుద్ధ విమానాల తయారీ అంకం విజయపథంలో సాగుతోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తన ఎక్స్‌ ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో- తోకలేని, మానవ రహిత, రిమోట్‌ ఆధారిత డ్రోన్‌ యుద్ధ విమానాన్ని (యూఏవీ) (UAV Ghatak) చిత్రదుర్గం సమీపంలోని సంస్థ ప్రయోగ వేదిక (ఏటీఆర్‌)లో విజయవంతంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విమాన విహార సాంకేతిక పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. తొలిసారిగా విమానానికి తోక లేని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచుకుని- రెక్కల సాయంతోనే రిమోట్‌, డ్రోన్‌ విధానాలను అనుసరించి చక్కని ఫలితాలను సొంతం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. చిత్రదుర్గం సమీపాన డీఆర్‌డీవో 4200 ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగ వేదిక నిర్మించింది. అందులో మూడు కిలోమీటర్ల నిడివి రన్‌వే ఏర్పాటు చేశారు. యుద్ధ సమయంలో ఇలాంటి వాహనాలు ఉపయోగపడతాయని నిపుణులు వివరించారు. ఈ వాహనం తొలి ఆకాశ ప్రయోగం నిరుడు జులై ఒకటో తేదీ చేపట్టారు. ఆపై అనేక మార్పులు చేశారు. ఆరుసార్లు విన్యాస పరీక్షలు కొనసాగాయి. శుక్రవారం నాటి ప్రయోగం ఏడోది. ఈసారి నిర్ణీత లక్ష్యాలను వాహనం పూర్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని