logo

ఎన్‌ఐఏ విస్తృత దాడులు

రాజధాని నగరంలోని బ్రూక్‌ఫీల్డ్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్‌ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.

Published : 28 Mar 2024 02:55 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : రాజధాని నగరంలోని బ్రూక్‌ఫీల్డ్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్‌ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు. చెన్నైలో లాడ్జిల్లో  ఎక్కువ రోజుల నుంచి ఉంటున్న వారిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. శివమొగ్గ, తీర్థహళ్లి, సొప్పుగుడ్డె చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానిత తీవ్రవాదులు అబ్దుల్‌ మతిన్‌ తాహ, ముసావీర్‌ హుసేన్‌ శాహిజ్‌ ఇళ్లతో పాటు వారి బంధువులు, సన్నిహితుల నివాసాల్లో సోదాలు చేశారు. కేఫ్‌కు వచ్చి పేలుడు పదార్థాన్ని పెట్టి వెళ్లిన నిందితుతుడికీ, చెన్నైలో కొందరు యువకులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. పేలుడు అనంతరం కేఫ్‌ పరిధిలోని మొబైల్‌ టవర్ల నుంచి వెళ్లిన ఫోన్‌ కాల్స్‌, ఇతర సమాచారం ఆధారంగా నిందితుల కోసం సీసీబీతో కలిసి ఎన్‌ఐఏ అధికారులు తమ కార్యాచరణను ముమ్మరం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని