logo

తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు

రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు.

Published : 28 Mar 2024 02:57 IST

చెళ్లకెర(చిత్రదుర్గం), న్యూస్‌టుడే : రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. బుధవారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో భక్తులు ఎండు కొబ్బరి గిటుకులను వేసి దహనం చేశారు. వేలాది మంది భక్తులు క్వింటాళ్ల కొద్ది ఎండు కొబ్బరిని గుండంలో వేయడం విశేషం. దేవాలయాన్ని రకరకాల పూలతో అందంగా అలంకరించారు.

ఎడ్ల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. జానపద కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. జిల్లా బాధ్య మంత్రి డి.సుధాకర్‌, చెళ్లకెర ఎమ్మెల్యే రఘుమూర్తి, మొళకాల్మూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ, ద్రాక్ష రస అభివృద్ధి మండలి అధ్యక్షుడు యోగిశ్‌బాబు, జిల్లా పాలనాధికారి వెంకటేశ్‌, అదనపు జిల్లా పాలనాధికారి కుమారస్వామి, సహాయక కమిషనర్‌ కార్తిక్‌, ఎస్పీ ధర్మేంద్రకుమార్‌ మీనా, జడ్పీ సీఈవో సోమశేఖర్‌, తహసీల్దారు రెహాన్‌పాష తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని