logo

ఛత్తీస్‌గఢ్‌ బంద్ నేపథ్యంలో మావోయిస్టుల దుశ్చర్య

బూటకపు ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ ఛత్తీస్‌గఢ్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Updated : 26 May 2024 10:56 IST

చర్ల: బూటకపు ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ ఆదివారం సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. చర్ల మండలం పూసుగుప్ప వద్ధిపేట మధ్యలో రొటీంత వాగు వద్ద చెట్లు నరికివేశారు. బంద్‌ను విజయవంతం చేయాలని కరపత్రాలు చెట్లకు అతికించారు. వంతెన కింద మంటలు పెట్టడంతో వంతెన బీటలువారింది. వంతెనకు ఇరువైపులా చెట్లు నరకడంతో రోడ్డుకు అడ్డంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మావోయిస్టులు ఎక్కడైనా మందుపాతరలు పెట్టారన్న అనుమానాలతో బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు