logo

బంగారు కవచాల అలంకారంలో సీతారామ దర్శనం

భద్రాచలం రామాలయంలో స్వామివారు శుక్రవారం బంగారు కవచాల అలంకారంలో దర్శనమిచ్చారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ప్రవర పఠించి కన్యాదానం నిర్వహించారు.

Published : 04 Feb 2023 04:37 IST

రూ.50 వేల విరాళం అందిస్తున్న దాతలు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో స్వామివారు శుక్రవారం బంగారు కవచాల అలంకారంలో దర్శనమిచ్చారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ప్రవర పఠించి కన్యాదానం నిర్వహించారు. సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ చేశారు. మాంగళ్యధారణ తలంబ్రాల వేడుక కొనసాగించారు. రాజాధిరాజైన శ్రీరామరాజుకు దర్బారుసేవ వైభవంగా సాగింది. లెబనాన్‌లో ఉంటున్న సురేంద్రశర్మ రూ.51,116 విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రాంరెడ్డి చేతుల మీదుగా దేవస్థానం ఖాతాకు జమ చేశారు. సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ నిర్వహించారు. గోదావరి నుంచి పవిత్ర జలాన్ని తీర్థ బిందెలో ఆలయానికి తీసుకొచ్చి ఈ వేడుకను ఆరంభించారు. నేడు కలశ ఆవాహన చేసి రేపు కలశాభిషేకం నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని