logo

రామయ్యను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాజ శరత్‌ కుటుంబ సమేతంగా శనివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు.

Published : 26 Mar 2023 03:39 IST

రామాలయం ధ్వజస్తంభం వద్ద జస్టిస్‌ శరత్‌తో ఆలయ సిబ్బంది

భద్రాచలం, న్యూస్‌టుడే: హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాజ శరత్‌ కుటుంబ సమేతంగా శనివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న అర్చకులు అర్చన చేశారు. అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామిని లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ప్రసాద అవధాని నేతృత్వంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. స్థానిక బ్రిడ్జి సెంటర్‌లోని అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన జడ్జికి ఆ ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనం అందించారు. జస్టిస్‌ శరత్‌ స్థానికులు కావడంతో పలువురు మర్యాద పూర్వకంగా కలిశారు.


జమలాపురంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గోపూజ నిర్వహించారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్లకు స్నపనము(స్నానం) చేయించి, నూతన వస్త్ర అలంకరణ జరుపగా శ్రీవారు, అమ్మవార్లు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్‌శర్మ, విజయదేవశర్మ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని