logo

జిల్లాలో వర్షం

నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న  జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలులతో ప్రజలు సేదదీరారు. అక్కడక్కడ జల్లులు కురిశాయి.

Published : 08 May 2024 02:46 IST

వైరా మండలం సిరిపురంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న  జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలులతో ప్రజలు సేదదీరారు. అక్కడక్కడ జల్లులు కురిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లలో నమోదైన వివరాల మేరకు... వేంసూరులో 24.3 మి.మీ. వర్షం కురిసింది. సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 14.0, పెనుబల్లి మండలం గౌరారంలో 8.5, ఎర్రుపాలెంలో 11.8, మధిర ఏఆర్‌ఎస్‌లో 7.5, ఏన్కూరులో 3.8, తల్లాడ, వైరా, చింతకాని, కల్లూరులో 0.5, పెనుబల్లిలో 8మి.మీ. వర్షపాతం నమోదైంది. 

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఖమ్మం రోటరీనగర్‌: ఈదురుగాలులకు వివిధ మండలాల్లో విద్యుత్తు సరఫరాకు మంగళవారం సాయంత్రం అంతరాయం కలిగిందని టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ   ఎ.సురేందర్‌ తెలిపారు. ప్రధానంగా కామేపల్లి, ఖమ్మం గ్రామీణం, బోనకల్లు, మధిర, పెనుబల్లి మండలాల్లో గాలుల తీవ్రత అధిక నష్టం కలిగించిందన్నారు. స్తంభాలు పడిపోవడం, చెట్లకొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపోయాయని చెప్పారు. రెండు రోజులుగా వీస్తున్న బలమైన గాలులకు జిల్లాలో ఇప్పటివరకు 309 స్తంభాలు, తొమ్మిది నియంత్రికలు పడిపోయాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు