Andhra News: అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పు

కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు నిప్పు పెట్టారు.

Updated : 24 May 2022 19:42 IST

అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురం భగ్గుమంది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు నిప్పు పెట్టారు. అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిని వేలాదిగా చుట్టుముట్టిన ఆందోళనకారులు ఇంటి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి ఇంటివద్ద ఉన్న ఎస్కార్ట్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని కూడా తగలబెట్టారు. దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు తరలించారు. మరోవైపు, అమలాపురంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

అమలాపురానికి అదనపు బలగాలు!

అమలాపురంలో పరిస్థితులను ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు సమీక్షిస్తున్నారు. అక్కడికి అదనపు బలగాలు తరలిస్తున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం, కాకినాడ, ప.గో, కృష్ణా జిల్లాల నుంచి బలగాలను రప్పిస్తున్నట్టు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని