logo

నాణ్యమైన విద్యఅందించేందుకు కృషి

ఆర్‌యూ పరిధిలో ఉన్న అనుబంధ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య ఎ.ఆనందరావు పేర్కొన్నారు. ఆర్‌యూలోని కాన్ఫరెన్సు హాల్‌లో అనుబంధ కళాశాలల ప్రిన్సిపళ్లతో బుధవారం సమావేశం నిర్వహించారు.

Published : 20 Jan 2022 03:28 IST

సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపళ్లు

కర్నూలు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: ఆర్‌యూ పరిధిలో ఉన్న అనుబంధ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య ఎ.ఆనందరావు పేర్కొన్నారు. ఆర్‌యూలోని కాన్ఫరెన్సు హాల్‌లో అనుబంధ కళాశాలల ప్రిన్సిపళ్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ సూచనలను పాటించాలన్నారు. బీఎడ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తప్పకుండా బ్లాక్‌టీచింగ్‌ చేయించాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య సంజీవరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య మధుసూదనవర్మ, సీడీసీ డీన్‌ సుందరానంద, అకాడమిక్‌ డీన్‌ ఆచార్య నాయక్‌, కళాశాలల ప్రిన్సిపళ్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని