logo

నేతాజీ మార్గం ఆదర్శనీయం

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆదోని పట్టణంలో విద్యార్థులు, యువకులు ఆదివారం వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అభయాంజనేయస్వామి

Updated : 23 Jan 2022 18:01 IST

ఆదోని మార్కెట్‌: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆదోని పట్టణంలో విద్యార్థులు, యువకులు ఆదివారం వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అభయాంజనేయస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం జాతీయ సహాయ కార్యదర్శి రాజశేఖర్‌రావు పాల్గొని మాట్లాడారు. యువత నేతాజీ చరిత్రను అధ్యయనం చేసి స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఈరోజును పరాక్రమ దివస్‌గా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శ్రీనివాస్‌, న్యాయవాది లోకేశ్‌కుమార్‌, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వర్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని