logo

విశ్రాంత ఇంజినీరు అనుమానాస్పద మృతి

కర్నూలు రామలింగేశ్వరనగర్‌కు చెందిన కె.పి.శివారెడ్డి (81) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. మున్సిపల్‌ ఇంజినీరుగా పనిచేసి 1999లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య లక్ష్మీదేవమ్మ 2019లో చనిపోయారు. ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. నలుగు

Published : 20 May 2022 06:22 IST


శివారెడ్డి (పాత చిత్రం)

 

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు రామలింగేశ్వరనగర్‌కు చెందిన కె.పి.శివారెడ్డి (81) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. మున్సిపల్‌ ఇంజినీరుగా పనిచేసి 1999లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య లక్ష్మీదేవమ్మ 2019లో చనిపోయారు. ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. నలుగురికీ వివాహాలు కాగా వేర్వేరు ప్రాంతాలు, దేశాల్లో స్థిరపడ్డారు. రెండో కుమార్తె లీలాకుమారి మాత్రం కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉంటున్నారు. రామలింగేశ్వర్‌నగర్‌లోని తన సొంత ఇంట్లో శివారెడ్డి ఒంటరిగా ఉండేవారు. అనారోగ్య సమస్యతో గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు. సమీప కాలనీలో ఉంటున్న కుమార్తె ఆయన యోగక్షేమాలు చూసేవారు. ఈ క్రమంలో పనిమనిషి నీలిమ గురువారం ఉదయం శివారెడ్డి ఇంటికి వెళ్లగా మంచంపై విగతజీవిలా కనపడటంతో వెంటనే ఆయన కుమార్తె లీలాకుమారికి ఫోన్‌ చేసి చెప్పారు. కుటుంబ సభ్యులంతా వచ్చి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. ముక్కు నుంచి రక్తం కారడం.. కళ్లజోడు పగిలిపోయి ఉండటాన్ని గుర్తించారు. మెడలో బంగారు గొలుసు కనపించకపోవటం అనుమానాన్ని పెంచింది. సమాచారం అందుకున్న నాలుగో పట్టణ సీఐ శంకరయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి రోడ్డు వరకు తచ్చాడింది. తండ్రి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ లీలాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని