logo

తరగతుల విలీన నిర్ణయం విరమించుకోవాలి

ఉన్నత పాఠశాలల్లో 3 ,4, 5వ తరగతులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.రంగన్న అన్నారు. ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలీనం కారణంగా విద్యార్థుల

Published : 20 May 2022 06:32 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంగన్న

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఉన్నత పాఠశాలల్లో 3 ,4, 5వ తరగతులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.రంగన్న అన్నారు. ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలీనం కారణంగా విద్యార్థులకు చదువు దూరమయ్యే పరిస్థితి తలెత్తుందని వాపోయారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండు చేశారు. సమావేశంలో రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షుడు రఘురామయ్య, ఆదోని అధ్యక్ష, కార్యదర్శులు మధు, రఘు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని