logo

పెళ్లింట విషాదం

పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి ఆ యువజంట ఒక్కటైంది.  డీజే పాటలతో బంధువులు సందడి చేశారు. వారితో వధూవరులూ జతకట్టి నృత్యం చేశారు. రాత్రి 2 గంటల వరకు ఊరేగింపు కొనసాగింది. అలసిపోయిన అందరూ నిద్రకు ఉపక్రమించారు.

Published : 26 Jun 2022 01:11 IST

వివాహమైన 12 గంటల్లోపే వరుడి అనుమానాస్పద మృతి

శివకుమార్‌

వెలుగోడు, న్యూస్‌టుడే: పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి ఆ యువజంట ఒక్కటైంది.  డీజే పాటలతో బంధువులు సందడి చేశారు. వారితో వధూవరులూ జతకట్టి నృత్యం చేశారు. రాత్రి 2 గంటల వరకు ఊరేగింపు కొనసాగింది. అలసిపోయిన అందరూ నిద్రకు ఉపక్రమించారు. కాసేపటి తర్వాత వరుడు కనిపించలేదు. చుట్టుపక్కల వెదకగా.. ఊరికి దూరంగా రహదారిపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. అప్పటి వరకు ఎంతో సందడిగా ఉన్న పెళ్లింట ఈ ఘటన పెను విషాదం నింపింది.

వెలుగోడు మండలం బోయరేవులకు చెందిన భాస్కర్‌ కుమారుడు శివకుమార్‌ (25)కు జూపాడు బంగ్లా మండలం భాస్కరాపురానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. అదేరోజు రాత్రి వధూవరుల మెరవని కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. రాత్రి 11 గంటల సమయంలో వధూవరులు ఉత్సాహంగా నృత్యం చేశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చూస్తే వరుడు కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనతో పలుచోట్ల వెతికినా కనిపించలేదు. ఉదయం 5 గంటల సమయంలో బోయరేవుల- మోతుకూరు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిపై వరుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. తలకు స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయి. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లాడో మిస్టరీగా మారింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోనే వరుడు శివకుమార్‌ మృతి చెందినట్లు ఎస్సై జగన్‌మోహన్‌ తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని