logo

జాతీయ లోక్‌ అదాలత్‌లో 9,676 కేసుల పరిష్కారం

ఉమ్మడి జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 9,676 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌, జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి కె.శ్రీనివాసకుమార్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. కర్నూలులో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యాయి.

Published : 14 Aug 2022 01:08 IST

న్యాయమూర్తుల చేతులమీదుగా పరిహారం చెక్కు అందుకుంటున్న కక్షిదారుడు

కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 9,676 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌, జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి కె.శ్రీనివాసకుమార్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. కర్నూలులో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యాయి. కర్నూలులో 6,375, ఆదోని 407, ఆళ్లగడ్డ 175, ఆలూరు 263, ఆత్మకూరు 378, బనగానపల్లి 232, డోన్‌ 486, కోవెలకుంట్ల 271, నందికొట్కూరు 165, నంద్యాల 314, పత్తికొండ 370, ఎమ్మిగనూరులో 240 కేసులను పరిష్కరించారు. కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా ఐదో స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని