logo

కొండలో అక్రమ పునాదులు

ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు ఆక్రమణదారులు కాజేస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలు కాపాడాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

Published : 24 Jan 2023 02:25 IST

అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలు

పత్తికొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు ఆక్రమణదారులు కాజేస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలు కాపాడాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. పత్తికొండ పట్టణంలో కర్నూలు రహదారిలోని కొండను తవ్వేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. సర్వే నంబరు 706లో  1.50 ఎకరాల విస్తీర్ణంలోని కొండను తవ్వేస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఇళ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన రెవెన్యూ అధికారి ఇంటి నిర్మాణం చేపట్టడం గమనార్హం. రెవెన్యూ శాఖలో పనిచేసిన కిందిస్థాయి అధికారి బినామీల పేరుతో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడి స్థలాలకు మంచి డిమాండ్‌ ఉండటంతో అక్రమార్కులు కొండ మొత్తం తవ్వేసి ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తున్నారు. పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటాం.. వారికి నోటీసులు పంపించి ఖాళీ చేయిస్తామని తహసీల్దార్‌ విష్ణుప్రసాద్‌ పేర్కొన్నారు.

1.15 ఎకరాలు పరాధీనం

మద్దికెర మండల కేంద్రంలోని మద్దికెర- అగ్రహారం ప్రధాన రహదారిలో సర్వే నంబరు 42-1, 43ఏలో ఉన్న 1.15 ఎకరాల రస్తాను ఆన్‌లైన్‌లో అక్రమంగా నమోదు చేయించుకున్నారు. తర్వాత తమ వెంచర్‌లో కలిపేసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బాధ్యులకు పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడం గమనార్హం. ఆక్రమణదారులు ఏకంగా జిల్లా అధికారులను ప్రసన్నం చేసుకుని కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ‘‘ ఈ విషయంపై మద్దికెర తహసీల్దారు నాగరాజు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పేరు మార్చిన విషయం నిజమే.. జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాం... ఆక్రమణదారులకు మరోసారి నోటీసు పంపిస్తాం.’’

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని