కూలీల ఆటో, ద్విచక్ర వాహనం ఢీ
ఆదోని మండలం కడితోట గ్రామ సమీపంలో శుక్రవారం మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో, ద్విచక్రవాహనం ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పొలంలోకి దూసుకెళ్లిన ఆటో
ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని మండలం కడితోట గ్రామ సమీపంలో శుక్రవారం మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో, ద్విచక్రవాహనం ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం బోయగేరికి చెందిన మహిళా కూలీలు ఆదోని మండలం హనవాళు, కొత్తూరు గ్రామాల్లో మిరప పొలానికి కూలి పనులకు ఆటోలో వెళ్తుండగా కడితోట సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఆటోలో వెళ్తున్న మునెమ్మ, జయలక్ష్మితో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తున్న కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన మహేశ్ గాయపడ్డారన్నారు. తీవ్రంగా ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. హొళగుంద మండలం ముద్దటం గ్రామానికి చెందిన శివయ్యస్వామి(62) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. జయలక్ష్మి, మహేశ్ పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు కర్నూలుకు తరలించాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం