logo

దద్దణాలను ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని: బీసీ

దద్దణాల చెరువును ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని బనగానపల్లి తెదేపా నేత బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు

Published : 01 May 2024 04:17 IST

మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్తి  బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: దద్దణాల చెరువును ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని బనగానపల్లి తెదేపా నేత బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పసుపల, పాతపాడు, మీరాపురం, యాగంటిపల్లి గ్రామాల్లో ‘ప్రజాగళం’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...కొచ్చెర్వు నుంచి దద్దణాలకు నీరు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే కాటసాని రైతులను మోసగించారన్నారు. రాష్ట్రంలో నవరత్నాల పేరిట నవమోసాలకు  వైకాపా పాల్పడిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని తెలిపారు. విద్యుత్తు ఛార్జీలను తొమ్మిదిసార్లు పెంచి రైతులను, ప్రజలను ఇక్కట్లకు గురిచేశారన్నారు. జాబ్‌క్యాలెండర్‌ అంటూ యువత, నిరుద్యోగులను మోసగించారని తెలిపారు. తెదేపా ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో తెదేపాకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని