logo

తెదేపాలో చేరిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

నంద్యాలకు చెందిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐఎంఏ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ డా.గుర్రాల రవికృష్ణ వైకాపాను వీడి తెదేపాలో చేరారు.

Published : 03 May 2024 03:45 IST

నంద్యాల పట్టణం, పాతపట్టణం, న్యూస్‌టుడే : నంద్యాలకు చెందిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐఎంఏ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ డా.గుర్రాల రవికృష్ణ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. హైదరాబాద్‌లో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో గురువారం ఆయన పార్టీ మారారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను దారికి తెచ్చే సామర్థ్యం చంద్రబాబుకే ఉందన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు వాకా శివశంకర్‌యాదవ్‌, అసెంబ్లీ ప్రొఫెషనల్‌ విభాగం అధ్యక్షుడు పత్తి ఉదయ్‌, మాజీ కౌన్సిలర్‌ అజ్మీర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని