logo

జిల్లా ప్రజల భాగస్వామ్యం బాగు : కలెక్టర్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వారాలపాటు నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో జిల్లాలోని ప్రజల భాగస్వామ్యం, స్ఫూర్తి ఆమోఘమని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. గురువారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయం నుంచి

Published : 12 Aug 2022 03:16 IST

పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై జాతీయ గీతం ఆలపిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, విద్యార్థులు

కందనూలు, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వారాలపాటు నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో జిల్లాలోని ప్రజల భాగస్వామ్యం, స్ఫూర్తి ఆమోఘమని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. గురువారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయం నుంచి మినీ ట్యాంక్‌బండ్‌ వరకు స్వాతంత్య్ర పరుగు నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని యువకులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు స్వాతంత్య్ర పరుగులో పాల్గొని విజయవంతం చేశారన్నారు. జిల్లాలో 14 రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కె.మనోహర్‌, జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదార్‌రెడ్డి పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

కందనూలు : ఈనెల 15న పట్టణంలోని పరేడ్‌ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరేడ్‌ మైదానంలో వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసే శకటాలు, స్టాల్స్‌ ఆకర్షణీయంగా ఉండాలన్నారు. వ్యవసాయశాఖ, ఉద్యావనశాఖ, ఎస్సీ కార్పొరేషన్‌, పంచాయతీరాజ్‌, అటవీ, వైద్యారోగ్యశాఖలు శకటాలు, స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని