logo

అసత్య ప్రచారాలు తగవు: కాంగ్రెస్‌

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేస్తోందని, దీనికి తోడు మరో ఐదు గార్యంటీలను అమలు చేసేందుకు సిద్ధపడుతున్న తరుణంలో ప్రతిపక్షాలు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు

Published : 01 May 2024 06:29 IST

 సమావేశంలో మాట్లాడుతున్న అభ్యర్థి మల్లు రవి
గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేస్తోందని, దీనికి తోడు మరో ఐదు గార్యంటీలను అమలు చేసేందుకు సిద్ధపడుతున్న తరుణంలో ప్రతిపక్షాలు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని ఓ ప్రైవేటు పంక్షన్‌ హాల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సరిత అధ్యక్షతన జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పుర ఛైర్మన్‌ కేశవ్‌ తదితరులు హాజరయ్యారు. మల్లు రవి మాట్లాడుతూ ప్రజల మద్దతుతో ప్రతిపక్షాల ఆరోపణలకు ఎన్నికల్లో గెలిచి సమాధానం చెపుతామని ధీమా వ్యక్తం చేశారు. కోడ్‌తో గ్యారంటీల అమలు నిలిచిపోయిందని, ఎన్నికల అనంతరం అమలు చేస్తామని పేర్కొన్నారు. నాయకులు గట్టు తిమ్మప్ప, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌ శంకర్‌, మధుసూదన్‌బాబు, ఇసాక్‌, కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, వెంకట్రామారెడ్డి పాల్గొన్నారు. ఉదయం పుర పరిధిలోని 7వ వార్డులో ఎంపీ అభ్యర్థి మల్లురవి వార్డు ఇన్‌ఛార్జి జగదీశ్‌ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

బహిర్గతమైన వర్గపోరు: పార్టీలో రెండు వర్గాల మధ్య ఉన్న పోరు మరోమారు ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెలుగు చూసింది. ప్రచారంలో భాగంగా పీసీసీ నుంచి గోడ పత్రికలు గద్వాలకు వచ్చి పదిరోజులు గడుస్తున్నా పంపిణీ చేయకపోడానికి కారణం తన ఫొటో ఉండటమేనని భావించిన చంద్రశేఖర్‌రెడ్డి వేదికపై ఉన్న నాయకులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న జిల్లా పరిషత్‌ వర్గీయులు, చంద్రశేఖర్‌రెడ్డితో వాదనకు దిగారు. రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ముఖ్య నాయకులు సర్దిచెప్పడంతో సద్దుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని