logo

భవనంపై నుంచి పడి విద్యార్థి మృతి

భవనంపై నుంచి ఓ విద్యార్థి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివకుమార్‌(16) మహబూబ్‌నగర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడు.

Published : 08 May 2024 02:49 IST

మహమ్మదాబాద్‌, న్యూస్‌టుడే: భవనంపై నుంచి ఓ విద్యార్థి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివకుమార్‌(16) మహబూబ్‌నగర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. పరీక్షల అనంతరం హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రుల చెంతకు వెళ్లాడు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.


ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

తిమ్మాజిపేట, న్యూస్‌టుడే : ఇంటర్‌ రెండో సంవత్సరంలో తప్పానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లిలో చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ వహీద్‌ వివరాలమేరకు.. వైష్ణవి (18) ఇంటర్‌ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యింది. ఫలితాలు వచ్చిన నాటినుంచి ఇంటివద్దే ముభావంగా ఉంటోంది. మంగళవారం తల్లి మల్లమ్మ ఉపాధి హామీ పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫినాయిల్‌ తాగింది. కొద్దిసేపటి తర్వాత పక్కనే ఉండే మేనమామ గుర్తించి జడ్చర్ల ఆసుపత్రికి అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


ఆత్మకూరులో మరొకరు...

ఆత్మకూరు, న్యూస్‌టుడే : అమరచింత మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థి (17) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు కొంతకాలంగా ఆత్మకూరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. చిన్న కుమారుడు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు