logo

గతమంతా ఘనం... ఇప్పుడంతా ధనం

ప్రధాన పార్టీల ప్రచారం, జాతీయ స్థాయి నేతలు సభలు జనసమీకరణకు ప్రస్తుతం అభ్యర్థులకు, నాయకులకు తలకుమించిన భారమే. భారీ సభలకు అంతే మొత్తంలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు.

Updated : 08 May 2024 06:44 IST

ధరూరు, న్యూస్‌టుడే : ప్రధాన పార్టీల ప్రచారం, జాతీయ స్థాయి నేతలు సభలు జనసమీకరణకు ప్రస్తుతం అభ్యర్థులకు, నాయకులకు తలకుమించిన భారమే. భారీ సభలకు అంతే మొత్తంలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. అభ్యర్థి మినహా, వెంట తిరిగే వారికి సైతం సాయంత్రానికి ముట్టజెప్పాల్సిందే అని వాపోతున్న పరిస్థితి ఉంది. ఎంత మారిపోయింది: గతంలో పార్టీలకు అంకితభావంతో పనిచేసే నాయకులు ఉండేవారు. పార్టీలను అంటిపెట్టుకొని అవసరమైతే జేబుల నుంచి ఖర్చు పెట్టి నాయకులను గెలిపించుకునే వారు. సుదూర ప్రాంతాల్లో సభలు జరిగినా అభిమానంతో స్వచ్ఛందంగా తరలివచ్చేవారు. రానురాను రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. నాకొచ్చేదేమిటి అంటున్న వారి సంఖ్య పెరిగిపోయింది. దాంతో పాటు ఖర్చులు పెరిగిపోయాయి. జాతీయ స్థాయి నాయకులు వచ్చినప్పుడు రూ.అరకోటి వరకు పంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. వాహనాలు, భోజనాల ఖర్చు దీనికి అదనం. ఓ మండల కేంద్రంలో అభ్యర్థి ప్రచారానికి వస్తే వెయ్యి మంది జనసమీకరణకు రూ.రెండు లక్షలు పంచాల్సి వచ్చిందని సమాచారం. బాణసంచా, పూలదండలు, ఇతర డప్పులు, వాయ్యిదాల ఖర్చు దీనికి అదనం. ఇక పురపాలికల్లో, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం కనీసం నేత వెంట ఓ 50 మంది ఉండాలి. నేత వెంట ప్రజలు నడవాలంటే రోజుకు ఉదయం సాయంత్రం కలిపి కనీసం రూ.25 వేలు చేతిలో ఉండాల్సిందేనని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు