logo

వేలిపై పెట్టే వీలు లేకుంటే..

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 13న జరుగనుంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు చెరిగిపోని సిరాను అంటిస్తారు. ఓటరు మళ్లీ రెండో సారి ఓటు వేసేందుకు అవకాశం లేకుండా ఈ నిబంధన విధించారు.

Updated : 08 May 2024 06:43 IST

న్యూస్‌టుడే, అచ్చంపేట: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 13న జరుగనుంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు చెరిగిపోని సిరాను అంటిస్తారు. ఓటరు మళ్లీ రెండో సారి ఓటు వేసేందుకు అవకాశం లేకుండా ఈ నిబంధన విధించారు. ఓటు వేసి బయటకు వచ్చి చాలా మంది తాము ఓటు వేశామని తెలిపేందుకు సిరా అంటించిన వేలును చూపెడుతుంటారు. ఫోటోలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలి గోరుకు సిరా గుర్తు అంటిస్తారు. ఓటర్లకు సిరా అంటించాల్సిన వేలు లేని సందర్భంలో ఎక్కడ గుర్తు పెట్టాలన్న విషయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక వివరణ ఇచ్చింది. ఓటరకు ఎడమచేతి చూపుడు లేనట్లయితే మధ్య వేలుకు సిరా గుర్తు పెట్టాల్సి ఉంటుంది. మధ్య వేలు కూడా లేని సందర్భంలో బొటన వేలుకు గుర్తు పెడతారు. ప్రత్యేక సందర్భాల్లో ఎవరికైనా ఎడమ చేతికి వేళ్లు లేకపోతే కుడి చేయి చూపుడు వేలుకు సిరా గుర్తు అంటిస్తారు. ఆ వేలు లేకుంటే మధ్య వేలు, ఆ తరువాత ఉంగరం వేలుకు సిరా అంటించాలన్న నిబంధన ఉంది. ఒక వేళ రెండు చేతులకు వేళ్లు లేకపోతే చేయి మధ్య భాగంలో లేదా పైభాగంలో భుజం వద్ద సిరా గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం నిబంధనలు పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు